ప్రకాశ్ రాజ్‌ను చంపేయండి.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్​: సినీ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ఇటీవల హిందూ దేవుళ్లపై చేసిన కామెంట్స్ వివాదాస్పదమవుతున్న విషయం తెలిసిందే. ప్రకాశ్ రాజ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రంగారెడ్డి అర్బన్ బీజేపీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి (Vanipally Srinivas Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది హిందూ వ్యతిరేకులు సనాతన హిందూ ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, అలాంటివారిని ఊరికించి కొడతామని హెచ్చరించారు.

ప్రకాశ్ రాజ్ (Prakash Raj) శ్రీరాముడు, లక్ష్మణుడుపై వ్యంగ్యంగా మాట్లాడిన వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతూ.. అతడ్ని అన్ని సినిమా ఇండస్ట్రీలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాశ్ రాజ్‌ను ఎవరైనా చంపితే, అందుకుతాను బాధ్యత వహిస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మంపై ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేసిన సహించేది లేదని తేల్చిచెప్పారు. ప్రకాశ్ రాజ్‌కు సంబంధించి ఎక్కడైనా షూటింగ్ జరిగితే అక్కడికి వచ్చి కొడుతామంటూ ఆయన హెచ్చరించారు.

Read Also: హైకోర్టు తీర్పు క్లీన్ చిట్ కాదు: పీసీసీ చీఫ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>