కలం, వరంగల్ బ్యూరో: వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మరిపెడ మండలంలోని ఇటుకల గడ్డ తండాకు చెందిన సంగీత (23)కు పెళ్లి కుదిరింది. ఈనెల 29వ తేదీన ఆమె వివాహం జరగాల్సి ఉంది. కానీ అంతలోనే ఆ యువతి గిరిపురం శివారులోని ఓ బావిలో శవమై కనిపించింది. ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతి మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. యువతి మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

