గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా

కలం, వెబ్ డెస్క్ : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలుగా సిఫార్స్ చేసిన ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్‌పై నిర్ణయం తీసుకోడానికి కొత్త గవర్నర్‌కు తగిన సమయం ఇవ్వాలని అటార్నీ జనరల్ వెంకటరమణి సుప్రీంకోర్టును కోరారు. గవర్నర్ నిర్ణయానికి అనుగుణంగా సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో విచారణను సుప్రీంకోర్టు జులై 22కు వాయిదా వేసింది.

కాగా, మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసి ఈ నెల 30తో ఆరు నెలలు కంప్లీట్ అవుతోంది. రాజ్యాంగం ప్రకారం మంత్రిగా కొనసాగాలంటే శాసనసభ లేదా శాసనమండలి సభ్యుడిగా ఉండడం తప్పనిసరి. అయితే ఏ సభలోనూ సభ్యుడు కాకుండా మంత్రిగా ఆరు నెలలు కొనసాగే అవకాశం ఉంటుంది. గడువు ముగిసేలోగా ఏదో ఒక సభలో సభ్యుడు కావడం అనివార్యం. దీంతో ఎమ్మెల్సీగా గవర్నర్ ఈ నెల 30 లోగా నిర్ణయం తీసుకోవడం తప్పనిసరిగా మారింది. ఈ నెల 30లోగా వీరి నియామకంపై కొత్త గవర్నర్ నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత న్యాయపరమైన చిక్కులు తొలగిపోయే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>