పంట చేతికొచ్చే వేళ.. అన్నదాతల అసలైన సంబరం మీరే చూడండి!

కలం, వెబ్‌డెస్క్: ఎదిగిన పిల్లలు ప్రయోజకులు అయినపుడు తల్లిదండ్రులు ఎంత సంబరపడతారో.. పంట చేతికి వచ్చినప్పుడు రైతులు కూడా అంతే సంబరపడతారు. నారుపోసి, నీరుపెట్టి కష్టపడి పెంచిన పంట చేతికి వచ్చినప్పుడు రైతు కళ్లల్లో కనిపించే ఆనందం అంతా ఇంతా కాదు. తాజాగా ఇటువంటి దృశ్యమే సోషల్ మీడియాలో వైరల్‌ (Viral Video) గా మారింది.

కాయకష్టం చేసి పండించిన పంట చేతికి రావడంతో ఓ రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పొలంలో వరికోత మెషీన్ నడుస్తుండగానే ఆ వృద్ధ రైతు ఆనందంతో గంతులేశాడు. పసిపిల్లాడిలా సంబరపడిపోయాడు. సంతోషంతో పొలంలో పరిగెడుతూ వరి కుప్పలపై గంతులు వేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఈ వయసులోనూ ఆయనకు ఉన్న ఫిట్‌నెస్, పంటపై తనకున్న అభిమానం చూసి ఫిదా అవుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>