హరిద్వార్‌లో భయంకర దృశ్యం.. ఒకే వాటర్ ట్యాంక్‌లో 27 పాములు

కలం, వెబ్‌డెస్క్: సాధారణంగా మనం ఒక పామును చూస్తేనే భయంతో వణికిపోతాం. అటువంటిది ఒకేసారి పాముల కుప్ప కనిపిస్తే ఇంకేమైనా ఉందా? అక్కడి నుంచి పరుగులు పెడతాం. ఇటీవల ఉత్తరాఖండ్‌ (Uttarakhand) హరిద్వార్‌ (Haridwar) లో ఇలాంటి భయంకర దృశ్యం వెలుగుచూసింది. కుళాయిల నుంచి నీటి సరఫరా సరిగ్గా రాకపోవడంతో యజమాని అండర్‌గ్రౌండ్‌లోని ట్యాంక్ (సంపు) మూత తీశారు.

లోపల చూస్తే ఏకంగా 27 పాములు ఒకదానిపై ఒకటి మెలికలు తిరుగుతూ కనిపించాయి. దీంతో భయంతో వణికిపోయిన ఆ కుటుంబం వెంటనే అటవీ శాఖను ఆశ్రయించింది. సిబ్బంది వచ్చి ట్యాంకులోని పాములన్నింటినీ బయటకు తీసి వాటిని అడవిలో వదిలేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>