పాల్వంచలో విషాదం.. చికిత్స పొందుతూ సర్పంచ్ మృతి

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palvancha) మండల పరిధిలోని దంతాల్ బోర ఎస్సీ కాలనీ గ్రామ పంచాయతీలో తీవ్ర విషాదం నెలకొంది. సీపీఐ పార్టీకి చెందిన సర్పంచ్(CPI Sarpanch) సోడే వెంకట రమణ శుక్రవారం భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. అనారోగ్య కారణాలతో వెంకట రమణను భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో ఆమె పరిస్థితి విషమించి మృతి చెందినట్లు సమాచారం.

సర్పంచ్ మృతి వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, సీపీఐ నాయకులు ఆసుపత్రికి చేరుకుని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే వెంకట రమణ మృతి చెందారని వారు ఆరోపించారు. సకాలంలో సరైన వైద్యం అందించడంలో ఆసుపత్రి సిబ్బంది విఫలమయ్యారని పేర్కొంటూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. సర్పంచ్ మృతికి గల అసలు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. వైద్యపరమైన అంశాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. సోడే వెంకట రమణ మృతితో దంతాల్ బోర ఎస్సీ కాలనీ గ్రామంలో, సీపీఐ నాయకులు, కార్యకర్తలలో తీవ్ర విషాదం నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>