కలం, వెబ్ డెస్క్: Viral Cooking | నేషనల్ హైవే అనగానే.. రయ్‌మంటూ దూసుకుపోయే వాహనాలు కళ్లముందు కదలాడుతాయి. నిత్యం బిజీగా ఉండే హైవేలపై (National Highway) నిమిషం కూడా వాహనాలను ఆపలేం. ఒకవేళ ఆపినా కొద్ది నిమిషాల పాటే. కానీ ఈ వీడియోలో కనిపించే జంట నేషనల్ హైవేను కిచెన్‌గా మార్చేసి వంట చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాతీయ రహదారి పక్కన ఓ జంట వంట చేయాలని నిర్ణయం నెటిజన్లను షాక్‌కు గురిచేసింది.
దర్జాగా తమ కారును హైవేపై ఆపేసి, మహిళ పెనంపై చపాతీలు కాల్చడం వీడియోలో చూడొచ్చు. అలాగే ఆ పిల్లాడు ఆడుకోవడం కూడా చూడొచ్చు. ఇదేమిటని? కొందరు ప్రశ్నిస్తే ఆ జంట ‘ఇది విశ్రాంతి ప్రాంతం. ఇక్కడ అనుమతి ఉంది’ అంటూ సమాధానమిచ్చారు. చాలామంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో ‘మేం రాకపోకలకు ఇబ్బందులు కల్గించలేదు కదా’ అంటూ వాదించారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారి కోసం విశ్రాంతి తీసుకోవడానికి టాయిలెట్స్, బెంచీలు ఏర్పాటుచేయాలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తే, హైవేపై వంట చేయడం అమోదమైంది కాదని మరికొందరు కామెంట్స్ చేశారు. ఏదేమైనా ఈ వీడియో(Viral Cooking) ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Read Also: బిచ్చగాళ్లతో ర్యాలీ.. ఎందుకంటే?
Follow Us On: Instagram


