Mobile Popup Ad
Mobile Popup Ad

పల్నాడు జిల్లా వినుకొండలో దొంగల హల్ చల్

కలం, వెబ్ డెస్క్ : పల్నాడు(Palnadu) జిల్లా వినుకొండ(Vinukonda) లో దొంగల వరుస చోరీలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. రెడ్డి నగర్ ప్రాంతంలో ఒక ఇంటి ముందు పార్క్ చేసిన బైక్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ దోపిడీ ఘటన సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. అయితే , కేవలం నాలుగు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో దొంగలు ఒక దుకాణాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని చోరీ చేశారు. ఇలా వరుస చోరీల కారణంగా స్థానికులు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ అధికారులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించి, భద్రతా చర్యలను పెంచాలని కోరుతున్నారు.

Read Also: మన ఆడబిడ్డకు అరుదైన గౌరవం.. బ్రిటన్ రాజకీయాల్లో హన్మకొండ మహిళ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>