మన ఆడబిడ్డకు అరుదైన గౌరవం.. బ్రిటన్ రాజకీయాల్లో హన్మకొండ మహిళ

కలం, వెబ్ డెస్క్: భారతీయ మహిళలు విదేశాల్లో సైతం రాణిస్తున్నారు. చదువు, ఉద్యోగం లాంటివాటికే పరిమితం కాకుండా రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. కీలక పదవులు చేపడుతూ మనదేశ ఔనత్యాన్ని చాటుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మూలాలున్న హేమ యెల్లాప్రగడ (Hema Yellapragada) బ్రిటన్‌లోని వార్విక్ జిల్లా కౌన్సిల్ (Warwick District Council) క్యాబినెట్ సభ్యురాలిగా నియమితులయ్యారు.

హన్మకొండ (Hanamkonda)కు చెందిన ఆమె 2023లో జరిగిన స్థానిక ఎన్నికల్లో గ్రీన్ పార్టీ తరపున కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమెకు అత్యంత కీలకమైన డీకార్బనైజేషన్ పోర్ట్‌ఫోలియోను కేటాయించారు. పర్యావరణ పరిరక్షణ, కర్బన ఉద్గారాల తగ్గింపు వంటి కీలక బాధ్యతలను ఆమె పర్యవేక్షించనున్నారు.

బ్రిటన్ పాలనా వ్యవస్థలో జిల్లా కౌన్సిళ్లు స్థానిక సేవల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయి. మెజారిటీ సాధించిన పార్టీ కౌన్సిల్ నాయకత్వాన్ని చేపట్టగా, ఎంపిక చేసిన సభ్యులకు వివిధ విభాగాల బాధ్యతలను అప్పగిస్తారు. తన నియామకంపై హేమ (Hema Yellapragada) స్పందిస్తూ.. వార్విక్ జిల్లా కౌన్సిల్ క్యాబినెట్ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉందని, మద్దతుగా నిలిచిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Read Also: పెళ్లయిన వ్యక్తితో సహజీవనం నేరం కాదు: అలహాబాద్ హైకోర్టు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>