వచ్చే శ్రీరామనవమి నాటికి ‘రామగిరి’కి అదనపు హంగులు: కోమటిరెడ్డి

కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండలోని రామగిరి (Ramagiri) సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి వచ్చే శ్రీరామనవమి నాటికి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) హామీ ఇచ్చారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని శుక్రవారం నల్గొండ రామగిరి దేవాలయంలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రామగిరి ఆలయానికి ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు తరలివస్తారని చెప్పారు. దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని, వైకుంఠ దర్శనం, ఉత్తర ద్వార దర్శనం వంటి సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

దర్శన మార్గాల విస్తరణ కోసం అవసరమైన స్థల సేకరణకై ఇప్పటికే చర్చలు జరుపుతున్నామని, నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. రామగిరి రామాలయానికి గొప్ప చరిత్ర ఉందని గుర్తుచేస్తూ మరిన్ని సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే, దేవాలయ భూములకు ఇబ్బంది కాకుండా నేషనల్ హైవే మార్గాన్ని బైపాస్ ద్వారా మళ్లించామని పేర్కొన్నారు. నల్గొండ పట్టణ ప్రజలు శ్రీరాముని కృపతో సుఖ: సంతోషాలతో ఉండాలని మంత్రి (Minister Komatireddy) ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై .అశోక్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పాశం రామ్ రెడ్డి, కార్పొరేటర్లు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

Read Also: ‘ఇక్కత్’​ రంగుల వెనుక నేతన్నల కన్నీటి వ్యథ

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>