కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులో ఎన్నికల ప్రచారం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా విజయ్(Vijay) నాయకత్వంలోని టీవీకే పార్టీ (TVK Party) వినూత్న టెక్నాలజీతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కుంభకోణం(Kumbakonam) నియోజకవర్గంలో జరిగిన ప్రచారం ప్రత్యేకంగా నిలిచింది. విజయ్ అన్ని ప్రాంతాలకు వ్యక్తిగతంగా వెళ్లడం సాధ్యం కాకపోవడంతో, పార్టీ నాయకులు ‘హోలోగ్రాఫిక్ ఏఐ కమ్యూనికేషన్’ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ సాంకేతికత ద్వారా విజయ్ నిజంగా అక్కడే ఉన్నట్లుగా ఆయన ప్రసంగం, హావభావాలు భారీ స్క్రీన్‌లపై ప్రత్యక్షమయ్యాయి.
దీనితో ప్రచార సభలో పాల్గొన్న ఓటర్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. స్టేజ్‌పై విజయ్ (Vijay Thalapathy) నిలబడి మాట్లాడుతున్నట్లుగానే కనిపించడంతో, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ టెక్నాలజీ వల్ల ఒక్కరోజులోనే అనేక నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం సులభమైంది. సమయం, ఖర్చు తగ్గడమే కాకుండా, ప్రతి చోటా నాయకుడు ప్రత్యక్షంగా పాల్గొని మాట్లాడుతున్నట్లు కనిపించడంతో ఈ కొత్త విధానం ఆసక్తికర చర్చకు దారి తీసింది. రాజకీయ ప్రచారంలో టెక్నాలజీ వినియోగం ఇదే మొదటిసారి కాదు కానీ, ఈ స్థాయిలో ‘హోలోగ్రాఫిక్ ఏఐ కమ్యూనికేషన్’ వాడటం మాత్రం కొత్త ట్రెండ్‌గా మారింది. దీంతో ఇతర పార్టీలు కూడా ఇలాంటి టెక్నాలజీలపై దృష్టి పెట్టే అవకాశముంది.
Read Also: చర్లపల్లి ఫ్యామిలీ సూసైడ్ కేసులో కొత్త ట్విస్ట్.. భర్త సంచలన ఆరోపణలు
Follow Us On: Pinterest

