ఆర్ధిక విధ్వంసానికి పాల్పడిన BRS ప్రభుత్వం: టీపీసీసీ చీఫ్

కలం, వెబ్ డెస్క్: గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్ధిక విధ్వంసానికి పాల్పడిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తీవ్ర ఆరోపణలు చేశారు. దోపిడి, దౌర్జన్యం చేశామనే రెండు విషయాలు కేటీఆర్ స్పష్టంగా ఒప్పుకున్నారని అన్నారు. సింగరేణిలో విద్యుత్ కొనుగోళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి చెరిపేస్తే చెదిరేది కాదని ఫైర్ అయ్యారు. పార్టీ మార్పుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మహేశ్ ఘాటుగా స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ‘భారతీయ జనతా రాష్ట్ర సమితి’గా మార్చినా తమకు ఇబ్బంది లేదని ఎద్దేవా చేశారు.

ఇక కేటీఆర్ పాదయాత్రపై (KTR Padayatra) మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్ర చేయవచ్చు అని.. పాదయాత్రను స్వాగతిస్తామని చెప్పారు. కానీ పాదయాత్రలో ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. ఇక కవిత (Kavitha) కొత్త పార్టీ అంశంపై టీపీసీసీ చీఫ్ (Mahesh Kumar Goud) మాట్లాడుతూ.. కవితకు, తమకు ఏంటి సంబంధం? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు పార్టీ పెట్టుకున్న స్వాగతిస్తామని చెప్పారు. వారి కుటుంబ వాటాల పంచాయితీ తమకు అంటగట్టద్దని ఎద్దెవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉండవని.. క్రమశిక్షణలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదన్నారు.

 Read Also: టైటిల్ కోసం అన్నా చెల్లెళ్ల ఫైట్.. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>