కలం, నిజామాబాద్ బ్యూరో: ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో ప్రజా పాలన కొనసాగిస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) వ్యాఖ్యానించారు. నిజామాబాద్‌లో సోమవారం జరిగిన కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యవర్తులకు అవకాశం లేకుండా పారదర్శకంగా ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేస్తుందని అన్నారు. పేద ప్రజల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ చర్యలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత ప్రజా పాలనకు స్పష్టమైన తేడా ఉందని వివరించారు.
సన్నబియ్యం పంపిణీతో పాటు నియోజకవర్గంలో అర్హులకు 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డుల అందజేసినట్లు తెలిపారు. ఎలాంటి రాజీ లేకుండా నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని ఆయన (Mahesh Kumar Goud) పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, స్థానిక ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
Read Also: చర్లపల్లి ఫ్యామిలీ సూసైడ్ కేసులో కొత్త ట్విస్ట్.. భర్త సంచలన ఆరోపణలు
Follow Us On : WhatsApp

