కరూర్‌లో టీవీకే అధినేత విజయ్(Vijay Thalapathy) రోడ్‌షో సందర్బంగా జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ కేసులో విజయ్‌పై బెంగళూరు హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తొక్కిసలాట జరితే ప్రజల గురించి పట్టించుకోకుండా.. టీవీకే నేతలు, అధినేత విజయ్ అక్కడి నుంచి పారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా విజయ్‌కు న్యాయకత్వ లక్షణాలే లేవని కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే తాజాగా తొక్కిసలాట బాధితుల కుటుంబాలను కలవాలని విజయ్ భావించాడు. దీంతో భారీ భద్రత మధ్య ఆయన బాధితుల కుటుంబాలను కలవాలని నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 17.. ఓ ప్రత్యేక వేదికలో బాధిత కుటుంబాలను పరామర్శించనున్నాడు విజయ్. అయితే ఈ పరామర్శకు సంబంధించి టీవీకే పార్టీ ఇప్పటి వరకు ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.
విజయ్(Vijay Thalapathy) పరామర్శ సమయంలో ఎటువంటి అవాంఛీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భారీ భద్రత ఏర్పాటు చేయాలని టీవీకే నేతలు కోరారని పోలీసులు తెలిపారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. ఈ కార్యక్రమానికి పరిమితి సంఖ్యలో మాత్రమే మీడియాను అనుమతిస్తామని తెలిపారు. తిరుచ్చి విమానాశ్రయం నుంచి కరూర్(Karur)లోని సమావేశ వేదిక దగ్గరకు విజయ్ చేరుకునే వరకు దారిలో ఎక్కడా జనం గుమిగూడకుండా విమానాశ్రయ, ట్రాఫిక్ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: దీపిక చెప్పిన స్టార్ హీరో అతడేనా..?

