epaper
Tuesday, November 18, 2025
epaper

ఎన్నికల అధికారికి బెదిరింపులు.. రంగంలోకి దిగిన ఈసీ

పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee)పై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి మనోజ్ అగర్వాల్‌(Manoj Agarwal)ను మమతా బెదిరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన వీడియో కావాలని కోరిందని సమాచారం. ఈ అంశంపై దర్యాప్తు స్టార్ట్ చేసిందని, అతి త్వరలోనే యాక్షన్ ప్లాన్ కూడా రెడీ అవుతుందని సన్నిహిత వర్గాల సమాచారం. ఈ విషయం సంచలనంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను, దాని అనువాద ప్రతిని అందించాలని సీఈఓ కార్యాలయానికి ఈసీ సూచనలు జారీ చేసింది.

అయితే హద్దులు దాటితే మనోజ్ అగర్వాల్‌పై ఉన్న అవినీతి ఆరోపణలను బయటపెడతానని మమతా బెనర్జీ ఇటీవల ఓ సమావేశంలో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అదే విధంగా రాష్ట్ర అధికారులను ఆయన బెదిరించారని కూడా మమతా ఆరోపించారు. 2011లో సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి.. ఓ సీఈవోపై దీదీ(Mamata Banerjee) ఈ స్థాయిలో ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి.

Read Also: తొక్కిసలాట బాధితులను కలవనున్న విజయ్..

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>