పని గంటలపై ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద రచ్చే జరుగుతోంది. ఈ రచ్చకు దీపిక(Deepika Padukone) కేంద్రంగా ఉంది. తాజాగా తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థంకావట్లేదన్న దీపక.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొందరు స్టార్ హీరోలు ఎనిమిది గంటలకు మించి పని చేయరని, వీకెండ్స్‌లో ససేమిరా అని చెప్తారని వివరించింది. వారికి లేని రూల్ తనకు మాత్రమే ఎందుకని ప్రశ్నించింది. తాను ఎనిమిది గంటలనే పనిచేస్తా అంటే మాత్రం నానా రాద్దాంతం చేస్తున్నారని, అంతా విమర్శలు చేస్తున్నారని అన్నారు. అయితే అసలు దీపిక చెప్పే హీరో ఎవరు? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాగా, దీపిక చెప్పింది.. అక్షయ్ కుమార్ గురించి అని టాక్ వినిపిస్తోంది.
గతంలో ఓ టీవీ షోలో అక్షయ్ గురించి అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) ఇంట్రస్టింగ్ విషయం ఒకటి షేర్ చేశాడు. అక్షయ్(Akshay Kumar) చాలా పంచువల్‌గా ఉంటారని చెప్పాడు. అంతేకాకుండా షూట్ ఉదయం 7 గంటలకు అంటే ఆ సమయానికి వచ్చేస్తాడని, ఎనిమిది గంటలకు మించి ఒక్క నిమిషం కూడా పనిచేయడని వివరించాడు అభిషేక్ వివరించాడు. ఎనిమిది గంటలు అయ్యాయంటే మేకప్ తీసేసి వెళ్లిపోతాడని తెలిపాడు. దీంతో దీపిక(Deepika Padukone) చెప్పిన స్టార్ హీరోల్లో అక్షయ్ కూడా ఉన్నాడా? అన్న టాక్ నడుస్తోంది.

