Mobile Popup Ad
Mobile Popup Ad

టీవీకే కొత్త పాట‌.. ప్ర‌చారంలో స్వ‌యంగా పాడిన విజ‌య్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో ప్ర‌చారాలు పోటాపోటీగా సాగుతున్నాయి. టీవీకే అధినేత విజయ్ (TVK chief Vijay) తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. విజయ్ ఇప్పటికే రెండు నియోజకవర్గాల నుంచి నామినేషన్ దాఖలు చేశారు. పెరంబూర్‌, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజ‌య్ పోటీ చేస్తున్నారు. తిరుచ్చి (Trichy)లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో విజ‌య్ దూసుకెళ్తున్నాడు. ఈ రోజు నిర్వ‌హించిన ఓ భారీ బ‌హిరంగ స‌భ‌లో విజ‌య్ పాట పాడి త‌న అభిమానులు, కార్య‌క‌ర్త‌లు, ఓట‌ర్ల‌లో జోష్ నింపాడు. టీవీకే పార్టీ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం ఒక కొత్త పాట‌ను రూపొందించారు. ఈ పాట‌ను విజ‌య్ స్వ‌యంగా వేదిక‌పై పాడారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

త‌మిళ‌నాడులో మొత్తం 234 నియోజకవర్గాలకు ఏప్రిల్ 23, 2026న ఒకే దశలో పోలింగ్ జ‌రుగ‌నుంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా మార్చి 30న నోటిఫికేషన్ విడుదల కాగా, నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 6 చివరి తేదీగా నిర్ణయించారు. ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 9న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కానుంది. పోలింగ్ జరిగిన సుమారు పది రోజుల తర్వాత, మే 4, 2026న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియ మే 6లోపు పూర్తి కావాల్సి ఉంది. దాదాపు త‌మిళ‌నాడులోని ముఖ్య నేత‌లంతా ఇప్ప‌టికే నామినేష‌న్లు దాఖ‌లు చేశారు.

Read Also: కేసీఆర్ కాళ్లు ప‌ట్టుకొనైనా నీ అంతు చూస్తా.. అధికారికి పేర్ని నాని వార్నింగ్‌!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>