కలం, వెబ్ డెస్క్ : తమిళ స్టార్ హీరో విజయ్ చివరి సినిమా ‘జననాయగన్’ జనవరి 9న రిలీజ్ కాబోతోంది. హెచ్.వినోద్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను తెలుగులో జననాయకుడు (Jana Nayakudu) పేరుతో రిలీజ్ చేస్తున్నారు. పూజాహెగ్డే, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. బాబీ డియోలో విలన్ గా చేస్తున్నాడు. ప్రమోషన్లలో భాగంగా తాజాగా జననాయకుడు (Jana Nayakudu) ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఫుల్ లెంగ్త్ మాస్ అండ్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తోంది. పాలిటిక్స్ ను బేస్ చేసుకునే తీస్తున్నా.. ఇందులో ఆర్మీ ఆఫీసర్ గా విజయ్ కనిపించబోతున్నాడు. ‘ముట్టుకుంటే ముక్కలైపోతారు’ అని విజయ్ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్ ఆకట్టుకుంటోంది. విజయ్ కూతురుగా నటిస్తున్న మమతా బిజుకు ఓ భయం ఉంటుంది. ఆ భయం ఏంటో తెలుసుకుంటే ఇండియానే కాపాడొచ్చు అనేది విజయ్ డైలాగ్. ఆ డైలాగ్ ను బట్టి మమత బిజు చుట్టూ కథ లింక్ అయి ఉంటుందని తెలుస్తోంది.
రాజకీయాల్లోకి వచ్చేది దోచుకోడానికి, హత్యలు చేయడానికా అంటూ విజయ్ చివర్లో చెప్పిన డైలాగ్ ను బట్టి పొలిటికల్ ఎజెండా కూడా ఇందులో చూపించబోతున్నట్టు అర్థం అవుతోంది. విజయ్ యాక్షన్ సీన్లు కూడా బాగానే కనిపిస్తున్నాయి. ఇండియా మీద విలన్ చేసే కుట్రలను హీరో ఎలా తిప్పి కొట్టాడు అనేది కథ. ఇలాంటి కథలతో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. మరి విజయ్ ఈ కథతో హిట్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.
Read Also: చిరూ మూవీ నుంచి రమణ గోగుల పాట తీసేశారా..?
Follow Us On: Sharechat


