టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda).. హిట్‌ను చూసి చాలా కాలమైంది. ‘గీతాగోవిందం’ తర్వాత మళ్ళీ హిట్ అన్న మాట విజయ్ కెరీర్‌లో కనిపించలేదు. ఆ తర్వాత ఎన్నో ఆశలతో వరుస సినిమాలు తీసినా ఒక్కటీ బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు. లైగర్, ఖుషీ, ఫ్యామిలీ స్టార్‌తో పాటు 2025లో వచ్చిన ‘కింగ్‌డమ్’ కూడా ప్లాప్ అయ్యాయి. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలి తానేంటో నిరూపించుకోవాలని విజయ్ కసిగా ఉన్నాడు. ఇందులో భాగంగానే తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌లపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ఈ రౌడీ హీరో చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. వాటిపై గంపెడన్నీ ఆశలతో విజయ్ ముందుకెళ్తున్నాడు. వాటిలో ‘రౌడీ జనార్థన్(Rowdy Janardhan)’ కూడా ఒకటి.
ఇప్పటికే ఈ మూవీ పోస్టర్స్ రెండు రాగా.. వాటిని చూస్తేనే మరోసారి ఫుల్ యాక్షన్‌ను నమ్ముకున్నా విజయ్ అని అర్థమైపోతోంది. ఈ మూవీ దిగ్గజ నిర్మాణ సంస్థ SVC బ్యానర్‌లో తెరకెక్కుతోంది. ఈ మూవీకి ‘రానీ వారు రాజా వారు’ ఫేమ్ రవికిరణ్ కోలా డైరెక్షన్ వహిస్తున్నాడు. ఈ నెల 11న ఈ సినిమా(Rowdy Janardhan)ను లాంఛనంగా ప్రారంభించాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఈ మూవీలో విజయ్ సరసన కీర్తి సురేష్(Keerthy Suresh) నటించనుంది. విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడిని పరిశీలిస్తునస్నట్లు సమాచారం.

