టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో కాజల్(Kajal Aggarwal) కూడా ఒకరు. పెళ్ళి తర్వాత అమ్మడి స్పీడ్ కాస్తంత తగ్గింది కానీ.. అవకాశాలు మాత్రం బాగానే అందుకుంటోంది. తాజాగా హీరోయిన్ నుంచి లాయర్‌గా కొత్త అవతారం ఎత్తింది ఈ పంచదారబొమ్మ. తెలుగు, తమిళం, హిందీ సహా పలు ఇతర భాషల్లో కూడా వరుస ప్రాజెక్ట్‌లతో అదరగొట్టిన కాజల్.. ఇటీవల కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు రీఎంట్రీని స్ట్రాంగ్‌గా ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే ‘ది ఇండియా స్టోరీ(The India Storry)’ అనే మూవీ చేస్తోంది. ఈ మూవీలో శ్రేయాస్ తాల్పడే కీలక పాత్ర పోషిస్తున్నారు. చేతన్ డీకే(Chetan DK) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తయింది. తాజా తన రీఎంట్రీని ఫిక్స్ చేస్తూ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది కాజల్.
ఈ సినిమా అంతా కూడా వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న రైతులకు పురుగు మందు వ్యాపారుల కుంభకోణాల మధ్య కొనసాగుతుంది. రైతులను ఎలా మోసంచేస్తున్నారు? అనేదే మెయిన్ థీమ్. ఇందులో రైతుల హక్కుల కోసం పోరాడే న్యాయవాది పాత్రలో కాజల్(Kajal Aggarwal) కనిపించనుంది. ఈ మూవీ ద్వారా వ్యవసాయం, న్యాయం, రైతుల సమ్యలపై సామాజిక చైతన్యం తీసుకురావాలని మూవీ యూనిట్ భావిస్తోంది.

