నిన్న స్నేహితురాలు, నేడు అర్ధాంగి.. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్

కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (Vijay-Rashmika) ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి (Marriage) చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లితో వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ తన భార్య రష్మికనుద్దేశించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘‘ఆమె పక్కన ఉంటేనే ఆ రోజు పరిపూర్ణం అనిపించే భావన. భోజనం దగ్గర కూర్చున్నా, జిమ్‌లో కష్టపడుతున్నా ఆమె తోడుంటే బాగుంటుందనే చిన్న ఆశ. తాను నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఎక్కడ ఉన్నా సరే, ఆమె పక్కన ఉంటేనే మనసుకి ప్రశాంతత, ఇంటికి వచ్చినంత హాయి లభిస్తుందని గ్రహించిన ఆ వ్యక్తి’’ అంటూ తన మనసులోని మాటలను తెలియజేశాడు.

తనకెంతో ఇష్టమైన, అర్థం చేసుకునే ప్రాణస్నేహితురాలనే అర్ధాంగిగా మార్చుకున్నాని విజయ్ దేవరకొండ అన్నాడు. ‘నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు నా భార్య’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. స్నేహానికి ప్రేమ తోడైతే జీవితం ఎంత అందంగా ఉంటుందో ఈ జంట (Vijay-Rashmika) నిరూపించింది. ప్రస్తుతం విజయ్, రష్మిక పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Kalamdaily (@kalamtelugu)

Read Also : రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ సెకండ్ సింగిల్ బిగ్ అప్డేట్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>