epaper
Sunday, March 1, 2026
epaper

రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ సెకండ్ సింగిల్ బిగ్ అప్డేట్

కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది'(Peddi).. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ఈ ఏడాది ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. వృద్ది సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన క్యూట్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుంది.

ఆస్కార్ విన్నర్ ఏ. ఆర్ రెహమాన్(AR Rahman) మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ‘చికిరీ చికిరీ’ సాంగ్ మిలియన్ వ్యూస్ సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్ బిగ్ అప్డేట్ వచ్చింది. ‘రైయ్ రైయ్ రా రా ‘(Rai Rai Raa Raa) అంటూ సాగే ఈ సాంగ్ మార్చి 2వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది.

Read Also : నిన్న స్నేహితురాలు, నేడు అర్ధాంగి.. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!