హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) కారు ప్రమాదానికి గురయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఆదివారం తన స్నేహితులతో కలిసి పుట్టపర్తికి వెళ్లి సత్యసాయి సమాధిని సందర్శించుకున్న విషయం తెలిసిందే. ఈరోజు అక్కడి నుంచి తిరుగు ప్రయాణమైన ఆయన స్నేహితులతో కలిసి తన వెల్ఫైర్ కారులో హైదరాబాద్ కి బయలుదేరారు. కారు ఉండవల్లి సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురైంది. అయితే ఈ ఘటన నుంచి విజయ్ సురక్షితంగా బయటపడ్డారు. కారు స్వల్పంగా ధ్వంసం అవడంతో తన స్నేహితుని కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

