OG Collections | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ ‘ఓజీ’ సరికొత్త రికార్డ్ సృష్టించింది. కలెక్షన్ల విషయంలో అందరి అంచనాలను అధిగమించింది. 2025లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా ‘ఓజీ’ నిలిచింది. సెప్టెంబర్ 25న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. 11 రోజుల్లో రూ.308 కోట్లకుపైగా వసూళ్లు చేసింది. ‘రూల్స్ లేవ్.. చట్టాలు లేవ్.. ఓన్లీ గంభీర ‘లా’ మాత్రమే. ఇతడే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ అంటూ మూవీ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్.. ఎక్స్(ట్విట్టర్) వేదికగా కలెక్షన్లను అధికారికంగా ప్రకటించింది.
OG Collections | విడుదలైన రోజే ఈ మూవీ రూ.154 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. తొలిరోజు ఇంతటి కలెక్షన్లు రావడం పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే అత్యధికం. ఇప్పటి వరకు దాదాపు రూ.300 కోట్ల కలెక్షన్లతో వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా 2025 టాప్ గ్రాసర్ మూవీగా నిలిచింది. ఈ ఫుల్‌రన్ కలెక్షన్లను ‘ఓజీ’ 11 రోజుల్లోనే అధిగమించింది.

