సీనియర్ యాక్టర్ సావిత్రి బయోపిక్‌గా వచ్చిన ‘మహానటి(Mahanati)’ ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు. ఆ సినిమాలో నాగ చైతన్య(Naga Chaitanya) కూడా నటించాడు. అయితే ఆ సినిమా చేయకూడదని తాను అనుకున్నానని, అందుకోసం చాలా ప్రయత్నాలు చేసినా ఫలించలేదని తాజాగా వెల్లడించాడు నాగచైతన్య. తాజా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న చైతన్య.. తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగానే మహానటిలో తన పాత్రపై స్పందించారు. ‘‘మహానటి మూవీలో తాతయ్య(ANR) పాత్ర చేయాలని నాగ్ అశ్విన్ చెప్పగానే తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశా. ఆయనలా నటించడం ఇంకొకరికి సాధ్యం కాదు. అది తెలిసే తప్పించుకోవాలనుకున్నా. నేనేంటి ఏఎన్ఆర్‌లా చేయడం ఏంటి? నా వల్ల కాదు. మర్చిపోండి అని నాగ్‌కు చెప్పాను. పైగా ఆ సమయంలో ‘సవ్యసాచి’ కోసం గడ్డం పెంచి డిఫరెంట్ లుక్‌లో ఉన్నా. ఆ సినిమాలో ఏఎన్ఆర్ పాత్రకు ఆ లుక్ సూట్ అవ్వదని చెప్పి తప్పించుకుందామనుకున్నా. గడ్డం తీసేయడం కుదరదని కూడా చెప్పి పంపించేశా’’ అని చెప్పాడు.
‘‘కానీ మరో నెలన్నర తరవాత నాగశ్విన్ నా దగ్గరకు వచ్చాడు. ‘VFXలో గడ్డం తీసేస్తాను. ఆ పాత్ర నువ్వే చేయాలి’ అన్నాడు. ఇంక చేసేదేమీ లేక ఓకే చెప్పా. ఆ తర్వాత ఆలోచిస్తే ఒక విషయం అర్థమైంది. తాతయ్య పాత్రలో నేను కాకపోతే వేరే వాళ్లు నటిస్తారు. దాన్ని నా మనసు అంగీకరించదు. నేనుండగా ఆ పాత్ర ఇంకొకరు చేయడం ఏంటి? అనిపించింది. ఏవరు ఏమనుకున్నా ఆ పాత్ర నేనే చేయాలి అనుకున్నా. ఆ పాత్ర చేయడం నాకు దక్కిన అదృష్టంగా భావించా’’ అని Naga Chaitanya అన్నాడు.

