వెకేషన్ హ్యాపీగా తక్కువ కాస్ట్‌లో అయిపోవాలా.. ఈ టిప్స్ మీకే..!

కలం, వెబ్ డెస్క్:  సమ్మర్‌లో వెకేషన్ (Summer Vacations)  ప్లాన్ చాలా మంది చేస్తారు. వారిలో చాలా మంది జేబుకు చిల్లు పడుతుందన్న భయంతో ఆఖరి నిమిషంలో ఆగిపోతారు. మరికొందరు వెకేషన్‌కు వెళ్లినా అక్కడ ఏది ఎక్కడ ఉంటుందో సరైన అవగాహన లేక వెకేషన్ అంతా గందరగోళంగా, సరదానే లేకుండా గడిచిపోతుంది. అయితే మీ వెకేషన్ ప్రయాణం ప్రశాంతంగా, ఆర్థిక భారం లేకుండా సాగాలంటే ముందస్తు ప్రణాళికే కీలకమని నిపుణులు చెబుతున్నారు.

ఈ క్రమంలో హోస్టెలర్ సీఈఓ, వ్యవస్థాపకుడు ప్రణవ్ డాంగీ ప్రయాణ సమయాన్ని, డబ్బును ఆదా చేసే కొన్ని స్మార్ట్ హ్యాక్స్‌ను పంచుకున్నారు. ముందుగా ప్రయాణ లక్ష్యంపై స్పష్టత ఉండాలని ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఉన్న హోటళ్లు లేదా హాస్టళ్లను ఎంచుకోవడం వల్ల క్యాబ్ ఖర్చులు, ప్రయాణ అలసట తగ్గుతాయని వివరించారు. వీలైనంత తక్కువ లగేజీతో ప్రయాణించడం వల్ల రవాణాలో సమయం వృథా కాదని, అదనపు ఖర్చులు కూడా మిగిలించుకోవచ్చని సూచించారు.

ప్రయాణ తేదీల విషయంలో సరళంగా ఉండటం వల్ల కూడా లాభం ఉంటుందని ఆయన తెలిపారు. పర్యాటకుల రద్దీ తక్కువగా ఉండే ‘షోల్డర్ సీజన్’లో ట్రిప్ ప్లాన్ చేయడం వల్ల బుకింగ్స్‌పై భారీగా ఆదా చేయవచ్చన్నారు. కేవలం తక్కువ ధరకే ప్రాధాన్యం ఇవ్వకుండా, సరైన లొకేషన్ ఉన్న వసతిని ఎంచుకోవడం దీర్ఘకాలంలో డబ్బును ఆదా చేస్తుందని వెల్లడించారు.

ముఖ్యంగా నేటి డిజిటల్ నోమాడ్స్ కోసం వై-ఫై, పని చేసుకునేందుకు వీలుగా ఉండే కామన్ స్పేసెస్ కలిగిన హాస్టళ్లు ఉత్తమమని ప్రణవ్ సూచించారు. సోలో ట్రావెలర్స్ లేదా స్నేహితులతో వెళ్లేవారు షేర్డ్ రూమ్స్ ఎంచుకోవడం వల్ల ఖర్చు గణనీయంగా తగ్గుతుందన్నారు. ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలతో ప్రయాణాన్ని మరింత సులభంగా, సంతోషంగా మార్చుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అవగాహనతో కూడిన ఖర్చు, ముందస్తు ప్లానింగ్ వల్ల పర్యాటకులు సమయాన్ని ఆదా చేయడమే కాకుండా నాణ్యమైన అనుభూతిని పొందవచ్చు.

Read Also: నీళ్లు ఎక్కువగా తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>