epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సంక్రాంతికి వస్తున్న కింగ్ నాగార్జున

కలం, సినిమా: టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna).. సంక్రాంతికి సోగ్గాడే చిన్ని నాయనా అంటూ వచ్చారు. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు. ఇక అక్కడ నుంచి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాలి.. బ్లాక్ బస్టర్ సాధించాలని ఫిక్స్ అయ్యారు. బంగార్రాజు అంటూ సంక్రాంతికి వచ్చారు. మళ్లీ సక్సెస్ సాధించారు. ఆతర్వాత నా సామి రంగ అంటూ సంక్రాంతికి వచ్చారు. మళ్లీ సక్సెస్ సాధించారు. ఇలా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న నాగ్ ఈసారి కూడా వస్తుండడం విశేషం. అదేంటి.. ఈ సంక్రాంతికి నాగ్ మూవీ ఏముంది అనుకుంటున్నారా..?

మేటర్ ఏంటంటే.. నాగ్ తన సినిమాతో రావడం లేదు కానీ.. తన వాయిస్ ఓవర్ తో వస్తున్నారు. ఏ సినిమాతో అంటారా.. అనగనగా ఒక రాజు. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతికి వస్తుంది. ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో మరింత స్పీడు పెంచారు. ఈ సినిమాకు కింగ్ అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. దీనికి సంబంధించి ఓ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. నవీన్ పొలిశెట్టి సినిమాలో నాగ్ ఎలాంటి మాడ్యులేషన్‌తో వాయిస్ ఓవర్ ఇస్తున్నారా అనేది ఆసక్తిగా మారింది.

నాగ్ సంక్రాంతి (Sankranti)కి వచ్చిన ప్రతిసారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు. దీంతో ఇది సెంటిమెంట్ గా మారింది. ఈసారి తన వాయిస్ ఓవర్ తో వస్తున్నారు. అందుచేత ఈసారి నాగ్ (Nagarjuna) సెంటిమెంట్ కలిసొచ్చి నవీన్ పొలిశెట్టికి సక్సెస్ రావడం ఖాయం అనిపిస్తుంది. మరి.. ఈ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.

Read Also: వెంకటేష్​తో కాంబినేషన్ అదిరిపోతుంది – మెగాస్టార్ చిరంజీవి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>