కలం, వెబ్ డెస్క్ : వెనెజువెలా మీద అమెరికా దాడులు చేయడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పటికే ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను కూడా అరెస్ట్ చేసింది అమెరికా. దీంతో వెనెజువెలాలో (Venezuela) తీవ్ర సంక్షోభం నెలకొంది. అక్కడ మౌళిక సదుపాయాలు అన్నీ ధ్వంసం అయ్యాయి. కరెంట్, నీరు, రవాణా మొత్తం ఆగిపోయాయి. వెనెజువెలా ముడి చమురును ఎక్కువగానే ఎగుమతి చేస్తుండటంతో.. ఆ దేశం నుంచి చమురు కొంటున్న దేశాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయనే వార్తలు ఎక్కువయ్యాయి. అలాగే గోల్డ్, వెండి రేట్లు కూడా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.
పెట్రోల్, డీజిల్ పెరుగుతుందనే వార్తలపై కొందరు ట్రేడ్ నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. వెనిజువెలా 303 ఆయిల్ రిసర్వ్స్ లను కలిగా ఉన్నా.. ఆ దేశం పెద్దగా ఎక్స్ పోర్ట్ చేయట్లేదు. వెనెజువెలా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ ఆయిల్ ఎక్స్ పోర్ట్ దాదాపు చైనా కంపెనీలే ఎక్కువగా నిర్వహిస్తున్నాయి. వెనెజువెలా (Venezuela) నుంచి ప్రతి రోజూ 10లక్షల బ్యారల్స్ చమురు ఉత్పత్తి చేస్తే.. అందులో 5 లక్షల బ్యారల్స్ మాత్రమే ఎగుమతి అవుతోందని చెబుతున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అయ్యే చమురులో ఒక్క శాతమే అని చెబుతున్నారు. కాబట్టి చమురు రేట్లు పెరిగే ఛాన్స్ ఉండకపోవచ్చని అంటున్నారు. ఒకవేళ సంక్షోభం ఇలాగే కొనసాగితే అప్పుడు కొంత మేరకు పెరిగే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు. ఇక గోల్డ్ రేట్లు కొంత వరకు పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు.
Read Also: ఏరోనాటిక్స్ సదస్సు ప్రారంభం: తేజస్ రూపశిల్పులకు సన్మానం
Follow Us On: Sharechat


