కలం, వెబ్ డెస్క్ : దక్షిణ అమెరికా దేశం అయిన వెనిజువెలా (Venezuela) మీద అమెరికా మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ముందస్తు హెచ్చరికలు లేకుండా ఈ దాడులు చేయడంతో ఆ దేశంలో భయంకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మౌళిక వసతులను టార్గెట్ చేస్తూ యూఎస్ దళాలు దాడులు నిర్వహించాయి. కరెంట్, వాటర్ సప్లై సెంటర్ల మీద దాడులు నిర్వహిచండంతో.. వెనిజువెలాలో తిండి, నీళ్లు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వెనిజువెలాలో ప్రభుత్వ అస్థిరతతో పాలన స్తంభించిపోయింది. ప్రభుత్వ సేవలు మొత్తం ఆగిపోయాయి. మొన్న రాత్రి నుంచి వెనిజులాలో కరెంట్ లేక ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల మీద ఉన్న కొన్ని కరెంట్ స్తంభాల దగ్గరకు వెళ్లి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు.
అమెరికా దాడులతో తాగునీరు సప్లై కావట్లేదు. అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. చాలా చోట్ల ప్రభుత్వ ఆఫీసులకు తాళాలు వేశారు. పెద్ద సూపర్ మార్కెట్లు మొత్తం మూసేశారు. వీధుల్లోని చిన్న దుకాణాలే ఉండటంతో వాటి ముందు వేల మంది క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. మెడికల్ దుకాణాల ముందు అదే క్యూలు కనిపిస్తున్నాయి. ప్రజలంతా నిత్యవసర సరుకులు పెద్ద మొత్తంలో కొనడంతో ధరలు కొండెక్కాయి. దొరికిందే అదునుగా చాలా మంది చిన్న వ్యాపారస్తులు అన్నింటి ధరలు డబుల్ రేట్లకు పెంచేశారు. తాగునీరు లేక కారకాస్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. పబ్లిక్ రవాణా మొత్తం ఆగిపోయింది. ఎయిర్ పోర్టుల మీద దాడులు జరగడంతో బయట నుంచి ఎలాంటి సరుకులు రావట్లేదు. తాత్కాళిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దుతున్నట్టు తెలిపారు.

Read Also: నెక్ట్స్ మీరే.. మూడు దేశాలకు ట్రంప్ వార్నింగ్
Follow Us On: Instagram


