కలం, వెబ్డెస్క్: ‘నెక్ట్స్ మీరే’ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మూడు లాటిన్ దేశాల అధినేతలకు హెచ్చరిక (Trump warns) జారీ చేశాడు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించిన సంగతి తెలిసిందే. ఈ కమ్రంలో ట్రంప్ క్యూబా, మెక్సికో, కొలంబియా దేశాల అధినేతలకు వార్నింగ్ ఇచ్చాడు. ఈ దేశాల నుంచి సైతం అమెరికాలోకి డ్రగ్స్ వస్తున్నాయని, అనేక క్రిమినల్ గ్యాంగులు, మాఫియా ముఠాలకు ఇవి ఆశ్రయమిస్తున్నాయని ఆయన ఆరోపించారు. పద్ధతి మార్చుకోకపోతే త్వరలోనే మదురో పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అమెరికాను అస్థిరపరిచే మాదకద్రవ్యాలను కట్టడి చేసే ప్రయత్నాల్లో భాగంగా దాడికి వెనకాడబోమన్నారు. కాగా, వెనెజువెలాపై దాడి, మదురోను బంధించడాన్ని క్యూబా, కొలంబియా, మెక్సికో ఖండించాయి. ఇది ఆమెరికా దురాక్రమణగా పేర్కొన్నాయి. మరోవైపు ట్రంప్ చర్యలతో తాము అప్రమత్తమయ్యామని, వెనెజువెలా సరిహద్దులో సైన్యాన్ని మోహరిస్తున్నట్టు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తెలిపారు. ఈ విషయంపై ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికా స్టేట్స్, ఐక్యరాజ్యసమితి వెంటనే సమావేశమవ్వాలని కోరారు.

Read Also: వెనెజువెలాకు ఫ్రీ ఇంటర్నెట్.. ఎలాన్ మస్క్ కీలక ప్రకటన
Follow Us On: Instagram


