Mobile Popup Ad
Mobile Popup Ad

ఎనిమిదేళ్లలో 15వ సారి.. డేరా బాబాకు మళ్లీ పెరోల్​

కలం, వెబ్​డెస్క్​: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్చా సౌధా అధినేత, ‘డేరా బాబా’ (Dera Baba) గా పేరొందిన గుర్మీత్​ రామ్​ రహీమ్​ సింగ్​కు మరోసారి పెరోల్​ లభించింది. ఈ మేరకు రోహ్​తక్​ డివిజనల్​ కమిషనర్​ 40 రోజుల పెరోల్​ మంజూరు చేశారు. హర్యానాలోని శిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌధా ప్రధాన ఆశ్రమంలో ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేసిన కేసులో డేరా బాబాకు 2017లో 20 ఏళ్ల శిక్ష పడింది. అలాగే 16 ఏళ్ల కిందట ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసులోనూ మరో ముగ్గురితో కలసి దోషిగా తేలారు. ప్రస్తుతం రోహత్​క్​లోని సనారియాలో డేరా బాబా శిక్ష అనుభవిస్తున్నారు.

కాగా, పెరోల్​ లేదా ఫర్లో ( కొన్ని కేసుల్లో దీర్ఘకాల శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ప్రత్యేక సందర్భాల్లో శిక్ష నుంచి కొన్ని రోజులు సెలవు(ఫర్లో) తీసుకునే వెసులుబాటును హర్యా జైళ్ల శాఖ ఇస్తుంది)పై డేరా బాబా ఎనిమిదేళ్లలో 15వ సారి జైలు నుంచి బయటకు రావడం గమనార్హం. చివరిగా గతేడాది అక్టోబర్​లో 20 రోజుల పెరోల్​పై బయటకు వచ్చారు. కాగా, పెరోల్​ లేదా ఫర్లోపై బయటకు వచ్చిన 13 సందర్భాల్లో ఆయన ఉత్తరప్రదేశ్​లోని బాగ్​పట్​లో ఉన్న డేరా ఆశ్రమంలో గడిపారు. డేరా బాబాకు ఇలా బయటకు రావడాన్ని శిరోమణి గురుద్వారా ప్రబంధక్​ కమిటీ(ఎస్​జీపీసీ) పలుమార్లు వ్యతిరేకించింది. హర్యానా ప్రభుత్వంపై విమర్శలు చేసింది.

Read Also: అసోం స్క్రీనింగ్ కమిటీలో ప్రియాంక

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>