ఆరు గ్యారంటీలకు మంగళం పాడిన బడ్జెట్ : మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి

కలం, నిజామాబాద్ బ్యూరో : ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీతో పేద ప్రజలను, మహిళలను, నిరుద్యోగులను పూర్తిగా వంచించిన బడ్జెట్‌గా ఉందని అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) విమర్శించారు. గత సంవత్సరం బడ్జెట్ అంచనాలను ఈ ప్రభుత్వం అందుకోలేక పూర్తిగా విఫలమైందని ఇప్పటికే స్పష్టమైంది. అయినా కూడా మళ్ళీ అదే విధంగా అంకెల మాయాజాలంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు అయినా ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై (Six Guarantees), 420 హామీల అమలులో బడ్జెట్‌లో ఎలాంటి స్పష్టత లేదని ఆయన విమర్శించారు.

ప్రజలకు పనికొచ్చే స్కీంలకు కేటాయింపులు లేవు కానీ స్కామ్ లు చేసే ప్రాజెక్ట్ లకు కేటాయింపులు చేసారని పేర్కొన్నారు. కోటి 58 లక్షల మహిళలకు ఇస్తానన్న రూ.2500 చేయూత పథకం ప్రస్తావనే లేదని గుర్తు చేశారు. వృద్దులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు పెన్షన్‌ను రూ.2000 నుండి రూ.4000కి పెంపు కేటాయింపులు లేవని తులం బంగారం హామీ – పూర్తిగా మర్చిపోయారని వ్యాఖ్యానించారు. జాబ్ క్యాలెండర్ పూర్తిగా విస్మరించారని, పూర్తి కాలేని రుణ మాఫీపై స్పష్టత లేదు. “రైతు భరోసా” పేరుతో హామీలు ఇచ్చినా, ఇప్పటివరకు మూడు పంటలకు ఎగ్గొట్టారని విమర్శించారు. ఆచరణకు సాధ్యం కానీ రాజీవ్ యువ వికాసానికి మాత్రం బడ్జెట్ లో ప్రతి సారి కేటాయింపులు చేస్తూ వస్తున్నారని కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీల అమలులో ఈ బడ్జెట్ వాస్తవికతకు దూరంగా ఉందని చెప్పుకొచ్చారు.

ఈ ప్రభుత్వానికి భూములపై ఉన్న ప్రేమ.. ప్రజలకు ఇచ్చిన హామీలపై లేదని అన్నారు. మొత్తంగా ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజలను పూర్తిగా వంచించే బడ్జెట్‌గా నిలిచిందని ఈ బడ్జెట్ పూర్తిగా డొల్ల బడ్జెట్, గోల్మాల్ బడ్జెట్ అని అభివర్ణించారు. ఎన్నికల అప్పుడు ప్రజలకు అనేక హామీలతో ఆశలు కల్పించి బడ్జెట్ లో కేటాయింపులు చేయక పేద ప్రజలను నట్టేట ముంచారు అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) విమర్శించారు.

Read Also: ఉగాది పచ్చడిలా బడ్జెట్ : ఎమ్మెల్యే కూనంనేని

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>