కలం, వెబ్ డెస్క్: గత మూడేళ్ల పాలనలో సెక్రటేరియట్ (Secretariat) బిల్డింగ్ మెయింటెనెన్స్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) ఆరోపించారు. బీఆర్ఎస్ భవన్ లో నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. సెక్రటేరియట్ మెయింటెనెన్స్‌కు ప్రత్యేకంగా నిధులు సాంక్షన్ చేయాలని, కానీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సాంక్షన్ చేయలేదన్నారు. దీనిపై జేఎన్టీయూ, హైదరాబాద్ ఐఐటీ సిఫార్సు చేశాయని గుర్తు చేశారు. ప్రతి ఆరు నెలలకు ఒక సారి భవనాన్ని తనిఖీ చేయాలన్నారు. ఎంతో విలువైన సెక్రటేరియట్‌పై ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.
కేసీఆర్ (KCR) అమరవీరుల త్యాగాలకు గుర్తుగా 3 లక్షల స్వ్కేర్ ఫీట్‌లో అమరవీరుల స్మారకాన్ని నిర్మించినట్లు తెలిపారు. ప్రపంచంలో ఇలాంటి కట్టడాలు మూడే ఉన్నాయని, ఒకటి చికాగో, రెండోది దుబాయ్, మూడోది తెలంగాణలో ఉన్నాయని చెప్పారు. దాని గురించి పట్టించుకునే వారే లేరన్నారు. కనీసం దాన్ని ఊడ్చే వారు కూడా లేరని చెప్పారు. కేసీఆర్ కట్టిండు కాబట్టి దాన్ని సర్వ నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. దాన్ని రెగ్యులర్‌గా మెయింటైన్ చేయాల్సి ఉంటుందని, కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అందులో అద్భుతమైన ఆడిటోరియం, రెస్టారెంట్, థియేటర్ ఉన్నాయని.. వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావొచ్చని, ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ నిర్లక్ష్యంతో ఆ కట్టడానికి ఏమైనా అయితే కేసీఆర్ పేరును బద్నాం చేయొచ్చని ఇలా చేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth) ఆరోపించారు.
Read Also: ఇరాన్ తో యుద్ధం.. ట్రంప్ కు బ్రిటన్ మరో షాక్!
Follow Us On: X(Twitter)

