కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ తో యుద్ధంలో(Iran War) బ్రిటన్, ఫ్రాన్స్ వంటి మిత్రదేశాలు, నాటో కూటమిలో సభ్యులు తనతో కలవడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అసహనంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘కలిసిరండి .. లేకుంటే ఇకపై మీ చావు మీరు చావండి’ అంటూ సదరు దేశాలపై ట్రంప్ ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్ వార్నింగ్ కు బెదరని ఇంగ్లాండ్ ఆయనకు మళ్లీ షాకిచ్చింది. ఎంత ఒత్తిడి చేసిన యుద్ధంలో తాము పాల్గొనే ప్రసక్తే లేదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer) తేల్చి చెప్పారు.
ఇరాన్ యుద్ధం బ్రిటన్ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్టార్మర్ హెచ్చరించారు. తమకు బ్రిటన్ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పుకొచ్చారు. పశ్చిమాసియా యుద్ధంతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు ట్రంప్‌కు మరింత కోపం తెప్పించే విధంగా హార్ముజ్ జలసంధిని (Strait of Hormuz) తిరిగి తెరవడానికి మధ్యవర్తిత్వం వహిస్తామని, అవసరమైతే గ్లోబల్ హార్ముజ్ సమ్మిట్ నిర్వహిస్తామని వెల్లడించారు.
ఇదిలాఉంటే ఇరాన్ తో యుద్ధంలో (Iran War) నాటో మిత్రదేశాలు ఆశించిన స్థాయిలో మద్దతివ్వకపోవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటో (NATO) కూటమి నుంచి వైదొలిగే యోచనలో ఉన్నామని బ్రిటన్‌కు చెందిన ‘ది టెలిగ్రాఫ్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. నాటో కూటమి కేవలం పేపర్ టైగర్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఈ విషయం పుతిన్ కు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. ఆ కూటమి మాటలకు తానెప్పుడూ ప్రభావితం కాలేదన్నారు.
Read Also: చండీగఢ్ బీజేపీ ఆఫీసు ఎదుట పేలుడు
Follow Us On: Instagram

