కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ (Warangal) నగరంలో తాళం వేసిన ఇళ్లల్లో చోరిలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి పోలీసులు సుమారు పది లక్షల రూపాయల విలువ గల 35 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు లక్షల నగదు,టీవీలు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, మొబైల్ ఫోన్లు, వాచ్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని కొత్తూరు జెండా కు చెందిన బింగి రఘు @ సోనూ (19), బొక్కలగడ్డ కు చెందిన మహమ్మద్ అసద్ (19 ) ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచ్చినట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ మీడియా కు వెల్లడించారు.
Read Also: మూగ వేదన.. వృద్ధురాలి మృతదేహంపై పడి ఏడ్చిన కోతి, వీడియో వైరల్
Follow Us On: Sharechat

