కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నగర మున్సిపల్ బడ్జెట్ ఆశయాలకు విరుద్ధంగా ఉందని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ధ్వజమెత్తారు. కేంద్ర నిధులపై బండి సంజయ్ మాట తప్పారని, పాత బడ్జెట్‌ను (Budget) కాపీ పేస్ట్ చేశారని విమర్శించారు. ప్రజలను మోసం చేసినందుకు బండి సంజయ్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో కార్యాలయంలో విలేకరుల సమావేశంలో చల్ల హరిశంకర్ మాట్లాడారు. తమకు మేయర్ పదవి ఇస్తే కేంద్రం నుంచి రూ.200 కోట్లు నిధులు తెస్తానని చెప్పిన బండి సంజయ్ ఆచరణలో విఫలమయ్యారని విమర్శించారు.
పండుగలకు పెట్టే ఖర్చులను తగ్గించిన బీజేపీ పాలకవర్గం అవసరం లేకున్నా నియమించిన ఉద్యోగులు, వారు వాడుతున్న వాహనాల వృథా ఖర్చులు తగ్గించాలని డిమాండ్ చేశారు. 18 వేల ఇండ్లపై పెంచిన ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించాలని, ప్రజలపై పన్నుల భారం వేయొద్దని కోరారు. మున్సిపల్ ఆదాయానికి అనేక మార్గాలు అన్వేషించకుండా ఇంటి పన్నులు పెంచి వసూళ్లు చేయడం దారుణమన్నారు.
సమావేశంలో మాజీ కార్పోరేటర్ కచ్చు రవి, బీఆర్ఎస్ నాయకులు బండ శ్రీకాంత్, రాజకుమార్, గడ్డం ప్రశాంత్ రెడ్డి, షౌకత్, వాజిద్, గంగాధర చందు, ఆరె రవి గౌడ్, చేతి చంద్రశేఖర్, తొంటి రాజేందర్, మంతెన కిరణ్, గూడెల్లి రాజ్ కుమార్, నారదాసు వసంత రావు, సత్తినేని శ్రీనివాస్, సుంకెపాక విద్యాసాగర్, మిడిదొడ్డి నవీన్, గంటల రేణుక ఉన్నారు.
Read Also: సమంత హెల్త్ సీక్రెట్స్ ఇవే.. ఉదయాన్నే ఇవి పాటించేయండి!
Follow Us On: Sharechat

