epaper
Wednesday, February 18, 2026
epaper

యాదగిరిగుట్టలో బీఆర్ఎస్‌కు షాక్.. మున్సి‘పోల్స్’లో కాంగ్రెస్ ఏకగ్రీవం

కలం, ఆలేరు: యాదగిరిగుట్ట మున్సిపాలిటీ (Yadagirigutta Municipality) రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుండ్లపల్లి వాణీ భరత్ గౌడ్ కౌన్సిలర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ వార్డు నుంచి బరిలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి ఆవుల మమత సాయి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో వాణీ భరత్ గౌడ్ ఎన్నిక ఏకగ్రీవమైంది.

10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గుండ్లపల్లి వాణీ భరత్ గౌడ్‌ను ఇప్పటికే యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రకటించారు. ఈ క్రమంలో ఆమె ఏకగ్రీవం కావడం కాంగ్రెస్ (Congress) శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ విజయంతో యాదగిరిగుట్ట మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తనదైన శైలి రాజకీయ వ్యూహంతో ఈ ఏకగ్రీవ విజయాన్ని సాధించారని, నియోజకవర్గంలో తన పట్టును మరోసారి నిరూపించుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Yadagirigutta Municipality
Yadagirigutta Municipality

Read Also: మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి : డీజీపీ శివధర్​ రెడ్డి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>