epaper
Wednesday, February 18, 2026
epaper

జీరో టారిఫ్​.. ఐఫోన్​​, హార్లే డేవిడ్సన్​పై ఆదా!

కలం, వెబ్​డెస్క్​: భారత్​పై విధించిన 25శాతం టారిఫ్స్​ను 18శాతానికి తగ్గించారు ట్రంప్ (India US Trade Deal)​. అదే సమయంలో ఇండియా కూడా తమ వస్తువుల్లో కొన్నింటిపై జీరో టారిఫ్​కు అంగీకరించిందని చెబుతున్నారు. ముఖ్యంగా తమ లగ్జరీ బైక్​లపై ఇండియా భారీగా టారిఫ్​లు వేస్తున్నదని మొదటి నుంచి మండిపడుతున్న ట్రంప్​.. ఇప్పుడు దాన్ని జీరోకు చేస్తుందని, అలా ఒప్పందం కుదిరిందని అంటున్నారు. నిజంగా జీరో టారిఫ్​కు ఇండియా ఒప్పుకుంటే, అమలు చేస్తే.. హార్లే డేవిడ్సన్​ వంటి లగ్జరీ బైక్​ల రేట్లు సగం వరకు తగ్గుతాయి. గతంలో హార్లే డేవిడ్సన్​పై టారిఫ్​ 100 శాతం వరకు ఉండేది. ఆ సుంకంతో కలిపి హార్లే డేవిడ్సన్​ బైక్ ​మన దగ్గర రూ.20 లక్షలకు దొరికేది. కానీ.. జీరో టారిఫ్​తో అది రూ.12 లక్షలకే వచ్చే ఛాన్స్​ ఉంటుంది.

ఐఫోన్​పై రూ.30 వేలు..

అమెరికా నుంచి వచ్చే యాపిల్ ఐఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది (India US Trade Deal). ప్రస్తుతం వీటిపై ఇండియా విధిస్తున్న 22 శాతం టారిఫ్​.. ఇకపై జీరో అయితే, రూ.30 వేల వరకు ధరలు దిగుతాయి. రూ.లక్షన్నర రేట్​ ఉండే ఐఫోన్​ ప్రోమోడల్​ ధర రూ.లక్షా 20 వేలు కావొచ్చని బిజినెస్​ వర్గాలు లెక్కగడుతున్నాయి. అయితే.. యాపిల్ ఫోన్లపై జీఎస్టీ ఎక్కువ ఉండటంతో వాటి ధర అంతగా తగ్గకపోవచ్చన్న అభిప్రాయాలూ ఉన్నాయి.

విస్కీ.. ఫుల్​ కిక్కు!

జీరో టారిఫ్ వల్ల అమెరికా నుంచి దిగుమతి అయ్యే విస్కీ, స్పిరిట్​ రేట్లూ తగ్గుతాయి. అక్కడి విస్కీపై మన దేశం ప్రస్తుతం 150 శాతం పన్ను వేస్తున్నది. ఆ పన్నుతో కలిపి ప్రస్తుతం పలు బ్రాండ్ల విస్కీల ధరలు రూ.3వేల నుంచి 10వేల వరకు ఉన్నాయి. టారిఫ్​ జీరో అయితే.. వాటి రేటు సగానికి తగ్గుతుంది.

Read Also: టారిఫ్​ ​కట్​ ఎఫెక్ట్​.. పెట్రోల్​​ రేట్లు పెరుగుతాయా?

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>