epaper
Wednesday, February 18, 2026
epaper

మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి : డీజీపీ శివధర్​ రెడ్డి

కలం, వెబ్​ డెస్క్​ : మున్సిపల్​ ఎన్నికలను చట్ట ప్రకారం సవర్థవంతంగా నిర్వహించాలని డీజీపీ శివధర్​ రెడ్డి (DGP Shivadhar Reddy) అన్నారు. మంగళవారం ఆయన పోలీస్​ కమిషనర్లు, ఎస్పీలు, ఎస్‌హెచ్‌వోలతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారికి కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగుతుండగా.. 414 కార్పొరేషన్ వార్డులు, 2582 మున్సిపల్ వార్డుల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు చేయాలన్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ ఉంటుందని డీజీపీ స్పష్టం చేశారు.

ఎన్నికల (Municipal Elections) సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. ఓటర్లను ప్రభావితం చేయడం, బెదిరించడం చట్టరీత్యా నేరమన్నారు. సామాజిక, ఆర్థిక బహిష్కరణలకు పాల్పడినా, మద్యం పంపిణీ చేసినా జైలు శిక్ష తప్పదని డీజీపీ హెచ్చరించారు. లైసెన్స్​ కలిగి ఉన్న ఆయుధాలను పోలీస్​ స్టేషన్లలో అప్పగించాలని సూచించారు.

అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు వాడితే చట్టపరమైన చర్యలుంటాయన్నారు. గోడలపై పోస్టర్లు, అశ్లీల ప్రకటనలపై క్రిమినల్ కేసులు ఉంటాయని స్పష్టం చేశారు. ‘ప్రచార వాహనాలకు రిటర్నింగ్ అధికారి అనుమతి తప్పనిసరి. మతపరమైన సంస్థలను రాజకీయ ప్రచారానికి వాడితే నేరం. ద్వేషపూరిత ప్రసంగాలకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బహిరంగ సభలు, ఊరేగింపులకు ముందస్తు పోలీస్ అనుమతి తప్పనిసరి. రిగ్గింగ్, ఎన్నికల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి‘ అని డీజీపీ శివధర్ (DGP Shivadhar Reddy)​ పోలీసు అధికారులకు సూచించారు.

Read Also: జగిత్యాలలో ట్రాక్టర్ బోల్తా.. నలుగురు మహిళా కూలీలు దుర్మరణం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>