కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ లో ఏర్పడిన నూతన బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో జాతీయ గేయం వందేమాతరం (Vande Mataram) పాడడం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం, ప్రభుత్వ సహాయం పొందే ప్రతి పాఠశాలలో ఉదయం ప్రార్థనా సమయంలో వందేమాతరం (Vande Mataram) గేయాన్ని తప్పకుండా ఆలపించాలని పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలిచ్చింది.
కాగా, జాతీయ చిహ్నాలపై గౌరవానికి సంబంధించిన నిబంధనలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే బెంగాల్ ప్రభుత్వం జాతీయ గేయం ఆలాపనను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో బెంగాల్ లో కేవలం జాతీయ గీతం ’జన గణ మన..‘ ను మాత్రమే ఆలపించేవారు. సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ అధికారం చేపట్టిన తరువాత వందేమాతరం గేయం పై కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

