కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కలకత్తా హైకోర్టులో అనూహ్య రీతిలో ప్రత్యక్షమయ్యారు. ఎన్నికల అనంతర హింసపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణకు సంబంధించి ఆమె స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె న్యాయవాది దుస్తులు ధరించి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చీఫ్ జస్టిస్ ఎస్.సి. సుజయ్ పాల్ ధర్మాసనం ముందు ఆమె తన వాదనలు వినిపించనున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ (TMC) నాయకుడు, న్యాయవాది కళ్యాణ్ బెనర్జీ కుమారుడు శీర్షన్య బందోపాధ్యాయ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. కేసు విచారణ జరుగుతున్న తీరుపై, అందులోని కీలక అంశాలపై మమతా బెనర్జీ (Mamata Banerjee) పలు ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి న్యాయవాది కోటు ధరించి కోర్టుకు రావడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కోర్టు ఆవరణలో భారీ భద్రత మధ్య ఆమె తన గళాన్ని వినిపించేందుకు సిద్ధమయ్యారు.
Read Also: కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ
Follow Us On : WhatsApp

