మధ్యప్రదేశ్‌లో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు, పలువురు మృతి

కలం, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) దేవాస్ (Dewas) జిల్లాలో ఓ బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాద తీవ్రతకు భవనం కుప్పకూలడమే కాకుండా, పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు కార్మికులు మరణించినట్లు తెలుస్తోంది. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం అధికారులు దర్యాప్తు జరుపుతున్నారని సమాచారం.

Read Also: తెలంగాణ ఓటర్ల జాబితా ప్రక్షాళన.. జూన్ 25 నుంచి ‘సర్’

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>