Mobile Popup Ad
Mobile Popup Ad

వల్లభనేని వంశీ మందు పార్టీ.. వైరలవుతున్న వీడియో

కలం, వెబ్ డెస్క్ : వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) జైలు నుంచి విడుదలయిన తరువాత ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులతో కలిసి మందు పార్టీ చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు సంబంధించి టీడీపీ సపోర్టర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ’వామ్మో ఇదేందిరా ఇది‘ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. వీడియోలో చాలా మంది మందుతాగుతూ చర్చించినట్లు కనిపిస్తోంది. పార్టీ అయిపోయిన తరువాత మత్తులో ఉన్న వంశీకి మిత్రుడు అన్నం తినిపిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిపై టీడీపీ సపోర్టర్లు సెటైర్లు వేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, వల్లభనేని వంశీ గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు. తరువాత వైఎస్సార్సీపీలో చేరారు. గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసు, కిడ్నాప్, బెదిరింపులు, అట్రాసిట కేసుతో పాటు పలు కేసుల్లో ఆయన జైలుకు వెళ్లి ఇటీవల విడుదలయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>