Mobile Popup Ad
Mobile Popup Ad

రాజస్థాన్‌కు చుక్కలు చూపించిన ప్రఫుల్.. ఫస్ట్ ఓవర్‌లోనే 3 వికెట్లు!

క‌లం, వెబ్ డెస్క్‌: ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ప్రఫుల్ హింజ్ (Prafull Hinge) సంచలనం సృష్టించాడు. 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌ను తన తొలి ఓవర్‌లోనే కోలుకోలేని దెబ్బ తీశాడు. వేసిన మొదటి ఓవర్‌లోనే ఏకంగా 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని రెండో బంతికే పెవిలియన్ పంపిన ప్రఫుల్, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురెల్ (0), లువాన్-డ్రే ప్రిటోరియస్ (0)లను వరుసగా బుట్టలో వేసుకుని రాజస్థాన్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. ఒక‌టో ఓవర్ ముగిసేసరికి రాజస్థాన్ కేవలం 1 పరుగుకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒకానొక దశలో స్కోర్ బోర్డు కదలకుండానే రాజస్థాన్ గన్ బ్యాటర్లందరూ పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ప్రస్తుతం క్రీజ్‌లోకి రాజస్థాన్ కెప్టెన్ పరాగ్ వచ్చాడు. వరుస వికెట్లతో రాజస్థాన్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగిపోయింది. జైస్వాల్ ఒక్కడే ఇప్పుడు రాజస్థాన్‌ను ఆదుకోవాలన్న పరిస్థితి ఏర్పడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>