Mobile Popup Ad
Mobile Popup Ad

తొలిసారి ఆస్ట్రేలియా ఆర్మీ చీఫ్‌గా మ‌హిళ!

క‌లం, వెబ్ డెస్క్‌: ఆస్ట్రేలియా (Australia) దేశంలో అరుదైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. తొలిసారి ఆ దేశ ఆర్మీ చీఫ్‌ (Army Chief)గా ఓ మ‌హిళను నియ‌మించారు. ప్రస్తుతం చీఫ్ ఆఫ్ జాయింట్ కేపబిలిటీస్‌గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ సుసాన్ కోయిల్ (Susan Coyle) ఈ ఏడాది జూలైలో ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆస్ట్రేలియా దేశం ఏర్ప‌డ్డ గ‌త‌ 125 ఏళ్ల‌లో మ‌హిళ‌కు సైన్యాధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు ఇవ్వ‌డం ఇదే మొద‌టిసారి. ప్ర‌స్తుతం 55 ఏళ్ల వ‌య‌సున్న సుసాన్ కోయిల్ 1987లో ఆస్ట్రేలియా సైన్యంలో చేరి ప‌లు కీల‌క బాధ్య‌త‌ల్లో సేవ‌లు అందించారు. సుసాన్ కోయిల్ నియామ‌కంపై ప్ర‌ధాని ఆంథోనీ అల్బ‌నీస్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇది దేశంలోనే చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. దేశ రక్షణ దళాల్లో మహిళా ప్రాతినిథ్యాన్ని పెంచే దిశగా ఇది ఒక కీలక అడుగు అని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా రక్షణ దళాల్లో మహిళల భాగస్వామ్యాన్ని 2030 నాటికి 25 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేర‌కు కీల‌క చ‌ర్య‌లు తీసుకుంటోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>