సచిన్ రికార్డుపై వైభవ్ గురి.. టీమిండియాలో 15 ఏళ్ల సంచలనం!

కలం, స్పోర్ట్స్: వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi).. ఎందరో హేమామేమీల్లాంటి ప్లేయర్ల రికార్డులను తునాతునకలు చేశాడు. ఎన్నో సరికొత్త రికార్డులను తన పేరిట రాసుకున్నాడు. బుమ్రా బౌలింగ్‌లో తొలి బంతినే బౌండ్రీ దాటించిన ఘనత కూడా ఈ బుడ్డోడిదే. అయితే ఇప్పుడు వైభవ్ తన గురి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డ్‌పై పెట్టాడు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) నెలకొల్పిన అత్యంత పిన్న వయస్కుడైన భారత అంతర్జాతీయ క్రికెటర్ రికార్డు త్వరలో కనుమరుగు కానుంది. ఐపీఎల్ 2026లో అదరగొడుతున్న 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీని ఐర్లాండ్ పర్యటనకు ఎంపిక చేసేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున వైభవ్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ప్రపంచ స్థాయి బౌలర్లను సైతం లెక్కచేయకుండా అతను ఆడుతున్న తీరు సెలెక్టర్లను ఆకట్టుకుంది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఎదుర్కొన్న ఐదు బంతుల్లోనే రెండు సిక్సర్లు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో జోష్ హెజిల్‌వుడ్ ఓవర్లో ఒక సిక్సర్, మూడు ఫోర్లతో ఏకంగా 19 పరుగులు రాబట్టాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లోనూ వరుసగా రెండు సిక్సర్లు కొట్టి తన సత్తా చాటాడు.

ఈ ప్రతిభను గుర్తించిన సెలెక్షన్ కమిటీ, జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ20ల సిరీస్ కోసం వైభవ్ (Vaibhav Sooryavanshi) పేరును పరిశీలిస్తోంది. ఇప్పటికే షార్ట్‌లిస్ట్ చేసిన ఆటగాళ్లలో అతను ఉన్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. తక్కువ అనుభవం ఉన్న జట్లతో తలపడే సమయంలో ఇలాంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఐర్లాండ్ పర్యటనలో రాణిస్తే, జూలైలో జరిగే జింబాబ్వే టూర్‌కు కూడా వైభవ్ ఎంపికయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వైభవ్ తుది జట్టులో చోటు సంపాదించి అరంగేట్రం చేస్తే, 16 ఏళ్ల వయసులో అడుగుపెట్టిన సచిన్ రికార్డును అధిగమించి, భారత్ తరపున అతి చిన్న వయసులో ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ యువ ఆటగాడి భవిష్యత్తుపై క్రీడా వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Read Also: కేకేఆర్‌కు కష్టాలు.. మరోసారి రహానేని విమర్శించిన మనోజ్ తివారీ !

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>