కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి టీ.జీవన్ రెడ్డి (Jeevan Reddy) సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జగిత్యాలలో తన అరుచరులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాణహిత నది జలాలు వినియోగంలోకి రావాలంటే తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. అయినా మేడిగడ్డ బ్యారేజ్‌ను పునరుద్ధరణ చేయాలని సూచించారు. మిగిలి ఉన్న రెండేళ్ల సమయంలోనైనా ఈ పని చేయాలని.. లేకపోతే రాష్ట్రంలో వాటిల్లే కరువుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు. దీనిపై దృష్టిపెట్టాల్సిన కాంగ్రెస్ నేతలు.. మేడిగడ్డను సాకుగా చూపి కేసీఆర్ ను దోషిగా నెలబెట్టాలని చూశారని ఆయన విమర్శించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డినే దోషిగా మారుతున్నాడని అందుకే వారం రోజులుగా మేడిగడ్డ పునరుద్దరణపై ఆలోచన చేస్తున్నాడని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
నా చేరికతో బీఆర్ఎస్ లో నూతన అధ్యాయం మొదలు..
కేసీఆర్ (KCR) తో తన అనుబంధం ఈనాటిది కాదని.. ప్రజా జీవితంలోకి రాక ముందు నుంచే ఆయనతో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా పరిచయం ఉందని జీవన్ రెడ్డి (Jeevan Reddy) గుర్తు చేశారు. కేసీఆర్ తో కేవలం రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్నాయని, వ్యక్తిగతంగా ఎలాంటి భేషజాలు లేవన్నారు. తనతో ఉన్న అనుబంధం గురించి కేసీఆర్ కూడా చాలా సార్లు చేప్పాడని గుర్తు చేసుకున్నారు. ‘నా చేరికతో బీఆర్ఎస్ పార్టీలో ఒక నూతన అధ్యయనం ప్రారంభం కాబోతుంది’ అని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలని జీవన్ రెడ్డి ఆకాంక్షించారు.
Read Also: డీలిమిటేషన్‌పై కేంద్రానికి సీఎం స్టాలిన్ స్ట్రాంగ్ వార్నింగ్
Follow Us On: Facebook

