మోస్ట్ డేంజరస్ బ్యాటర్‌గా వైభవ్ సూర్యవంశీ.. బుమ్రాకే చుక్కలు

కలం, స్పోొర్ట్స్: ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అంటేనే బ్యాటర్లు భయపడతారు.. కానీ 15 ఏళ్ల ఓ కుర్రాడు అతన్నే భయపెట్టాడు. గౌహతి వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) విధ్వంసం సృష్టించాడు. కేవలం పరుగులే కాదు, రికార్డుల పరంగా చూసినా ఇప్పుడు ఐపీఎల్‌లోనే మోస్ట్ డేంజరస్ బ్యాటర్‌గా వైభవ్ అవతరించాడు. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 14 బంతుల్లోనే 39 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ అక్షరాలా 278.57. ఈ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డును వైభవ్ తన పేరిట లిఖించుకున్నాడు. కనీసం 20 బంతులు ఆడిన ఆటగాళ్ల గణాంకాలను పరిశీలిస్తే, ఐపీఎల్‌లో ప్రతి 4.9 బంతులకు ఒక సిక్సర్ బాదుతూ వైభవ్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆండ్రీ రసెల్ (6.8), రోమారియో షెపర్డ్ (5.1) వంటి దిగ్గజ హిట్టర్ల కంటే కూడా ఈ బీహార్ కుర్రాడు మెరుగైన స్థానంలో ఉండటం విశేషం.

ఈ మ్యాచ్‌లో వైభవ్ (Vaibhav Sooryavanshi) చూపించిన తెగువ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. పవర్‌ప్లేలో బుమ్రా (Jasprit Bumrah) బౌలింగ్‌లోనే రెండు భారీ సిక్సర్లు బాదడం అతని ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. రాజస్థాన్ జట్టు 3.2 ఓవర్ల పవర్‌ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 59 పరుగులు సాధించడంలో వైభవ్ కీలక పాత్ర పోషించాడు. ప్రధాన టీ20 లీగ్‌లలో 18 ఏళ్ల వయసు రాకముందే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా వైభవ్ నిలిచాడు. 335 పరుగులతో అతను ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, రియాన్ పరాగ్ (160) వంటి ఆటగాళ్లు అతని కంటే చాలా వెనుకబడి ఉన్నారు.

Read Also: నీళ్లు ఎక్కువగా తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>