epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కృష్ణాలో 34% నీళ్లు కేసీఆర్ చాలన్నారు.. మంత్రి ఉత్తమ్ కామెంట్లు

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణకు అన్యాయం చేసిందే మాజీ సీఎం కేసీఆర్ అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy). కృష్ణా జలాల్లో తెలంగాణకు 34% నీళ్లు చాలని ఆనాడు ట్రిబ్యునర్ ముందు ఒప్పుకుని తెలంగాణ ప్రజల గొంతు కోశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. శనివారం అసెంబ్లీలో కృష్ణా నది జలాలమీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుల వైస్ స్పెసిఫిక్ డివైడ్ చేయాలని ఉన్నది. కానీ అప్పుడు ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వలేదు. దానిపై చాలా సార్లు మీటింగులు నిర్వహించారు. కానీ 2023 ఎన్నికలకు ముందు నీటి వాటాల మీద తేల్చాలని బ్రిజేష్ ట్రిబ్యునల్ కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వాళ్లు కృష్ణాలో ఉన్న 811 టీఎంసీలను ఏపీ, తెలంగాణకు కేటాయించాల్సి ఉంది. బీఆర్ ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ 811 టీఎంసీల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని, ఆంధ్రాకు 512 టీఎంసీలు ఇవ్వాలని చెప్పింది. ఇదే విషయాన్ని ట్రిబ్యునల్ ముందు ఒప్పుకుని తెలంగాణ రైతులను దగా చేసింది బీఆర్ ఎస్ పార్టీనే’ అంటూ మండిపడ్డారు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy).

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ట్రిబ్యునల్ ముందు తెలంగాణకే 71 శాంత నీటి కేటాయింపులు చేయాలని, ఏపీకి 21శాతం చాలని వాదనలు వినిపిస్తున్నామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు మొదలైన తర్వాత 45 టీఎంసీలు గోదావరి నుంచి కృష్ణా నదికి డైవర్ట్ చేశారు. ఆ 45 టీఎంసీల్లో రెండు రాష్ట్రాల మధ్య పంపకాలు కాకముందే బీఆర్ ఎస్ ప్రభుత్వం ఆ నీటి వాటాతోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కడుతామని చెప్పారు. కానీ విభజనలో ఆ 45 టీఎంసీల్లో పాలమూరుకు నీళ్లు ఇవ్వాలని వాళ్లు ఎన్నడూ కొట్లాడలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే వాటిపై ట్రిబ్యునల్ ముందు మేం పోరాడుతున్నాం’ అంటూ వివరించారు మంత్రి ఉత్తమ్.

2016లో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు అప్పటి సీఎంలు కేసీఆర్, చంద్రబాబు హాజరయ్యారు. ఆ మీటింగ్ లో కూడా కేసీఆర్ తెలంగాణకు 299టీఎంసీలు చాలు అని చెప్పి వచ్చారని మంత్రి వివరించారు. ‘కృష్ణా ట్రిబ్యునల్ వచ్చేవరకు ఇలాగే ఉండాలని ఎవ్రీ ఇయర్ కేసీఆర్ చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు మేం దానికి ఒప్పుకోవట్లేదని ట్రిబ్యునల్ ముందు చెప్పాం. శాసనసభలో ఏకగ్రీవ తీర్మాణం చేసి తెలంగాణకే 71 శాతం ఇవ్వాలని కృష్ణా ట్రిబ్యునల్ ముందు వాదిస్తున్నాం. మార్చి 2025లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ముందు ఈ విషయాలను కూడా చెప్పి వచ్చామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

బీఆర్ ఎస్ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశామని చెబుతున్నారు. కానీ అదంతా అబద్ధం. అదే నిజమైతే జూరాల ప్రాజెక్టుకు మనకు 65 టీఎంసీలు కేటాయిస్తే.. బీఆర్ ఎస్ పదేండ్ల పాలనలో ఏ ఒక్క ఏడాది కూడా 65 టీఎంసీల నీటిని తెలంగాణకు వాడలేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం లక్షా 80వేల కోట్లు ఖర్చు చేశామని బీఆర్ ఎస్ చెబుతోంది. కానీ ప్రాజెక్టులు మాత్రం పూర్తి చేయకుండా అన్యాయం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చాలా త్వరగా అన్ని రకాల పర్మిషన్లు తెచ్చుకున్నారు. కానీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును మాత్రం పట్టించుకోలేదు. పూర్తి స్థాయిలో పర్మిషన్లు కూడా తీసుకోలేదు. ఏపీ అక్రమంగా రాయలసీమ ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజూ 3టీఎంసీల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తీసుకెళ్లింది. కానీ దాన్ని ఏనాడూ కేసీఆర్ వ్యతిరేకించలేదు. మేం అధికారంలోకి వచ్చాకనే దాన్ని విజయవంతంగా ఆపించగలిగాం’ అంటూ తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు మేం బలంగా ఇప్పుడు వాదనలు వినిపిస్తున్నాం. తెలంగాణకు అన్యాయం జరగనివ్వం అంటూ చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>