కలం, సినిమా : నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna),మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati sreenu) కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ వస్తుందంటే చాలు ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ వస్తాయి. గతంలో వీరి కాంబినేషన్ నుంచి సింహా, లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కాయి. రీసెంట్ గా వచ్చిన నాలుగో సినిమా ” అఖండ 2 “(Akhanda 2) సైతం అద్భుత విజయం సాధించింది. దీనితో వీరిద్దరు కలిసి సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ ఖాయం అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.
బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో ఇటీవల ఐదో సినిమా ప్రారంభం కాబోతుందని, ఆ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు న్యూస్ వైరల్ అయింది.కానీ తాజాగా బాలయ్య, బోయపాటి మూవీకి బ్రేక్ పడినట్లు తెలుస్తుంది. బోయపాటి డైరెక్ట్ బాలీవుడ్ మూవీ చేయనున్నట్లు సమాచారం. అయితే హీరో, నిర్మాత ఎవరనేది తెలియాల్సి ఉంది. ఇటు బాలయ్య కూడా తనకు గతంలో వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ అందించిన గోపీచంద్ మలినేని డైరక్షన్ లో మరో సినిమా చేయబోతున్నాడు . దీనితో బాలయ్య, బోయపాటి మూవీకి మరికొంత సమయం పట్టే అవకాశం వున్నట్లు తెలుస్తుంది.


